శ్రీశ్రీ షేక్ మహ్మద్ వాటికన్ నగర సందర్శన ఒక మైలురాయి
- September 17, 2016
దుబాయ్: అబూదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గురువారం వాటికన్ చారిత్రాత్మక పర్యటన చేశారు, యుఎఇ ఆధారిత ముస్లిం క్రైస్తవ మత సమ్మేళన ప్రదేశం నుంచి వాటికన్ వైభవాన్ని పొగిడారు.ఆ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ ని సందర్శన సమయంలో బాగా స్వాగతించారని షేక్ మహ్మద్ సమావేశ సమయంలో వారి సంభాషణ ఇరు మతాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించే దిశలో ఉందని చెప్పారు. షేక్ మహ్మద్ వాటికన్ సందర్శన ద్వారా ఇస్లాం మతం మరియు క్రైస్తవ మతం మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత పెంచుతుంది. ప్రస్తుత చాలా క్లిష్టమైన సమయంలో సహనం, సహకారం మరియు సాంస్కృతిక కమ్యూనికేషన్ కోసం చేసిన ఒక చాలా ముఖ్యమైన ఇస్లామిక్ విధానం ఇదని దుబాయ్ గ్రాండ్ ముఫ్తీ అహ్మద్ అల్ హద్దాద్ చెప్పారు ప్రపంచంలోని అనేక దేశాలలో తీవ్రవాదం తీవ్రంగా వ్యాపించి ఉన్న కారణంగా ముస్లింలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ఈ పర్యటన ఎంతో మంచి వాతావరణం నెలకొనడానికి దోహదపడిందని ఆయన అన్నారు. యుఎఇ లో ఉన్నవివిధ జాతులు, మతాలు మరియు సంస్కృతుల్లో అనేక మంది శాంతియుతంగా మరియు స్థిరత్వవరంగా జీవిస్తున్నారు. ఇస్లామిక్ సహనం యొక్క జీవనశైలికి ఇది ఒక ఏకైక ఉదాహరణ అని ఆయన అన్నారు. దుబాయ్ లో గ్రాండ్ ఇస్లామిక్ పండిత విభాగ సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం సుల్తాన్ అల్ కొలమా ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వాటికన్ సందర్శన ఒక క్లిష్టమైన సమయంలో అజ్ఞానం మరియు ద్వేషం పై పోరాడటానికి ఒక స్పష్టమైన సందేశంగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







