40 అక్రమ స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్
- September 17, 2016
షార్జా: 40 మంది అక్రమ స్ట్రీట్ వెండర్స్‌ని సార్జాలో గడచిన రెండు వారాల్లో అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతి లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండడమే వీరి అరెస్టులకు కారణం. షార్జా పోలీసులు మరియు షార్జా మునిసిపాలిటి సంయుక్తంగా ఆకస్మిక దాడులు జరిపి అక్రమ స్ట్రీట్ వెండర్స్‌ని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం 33 అక్రమ వెండర్స్‌ని అల్ సజ్జా ఇండస్ట్రియల్ ఏరియాలో అరెస్ట్ చేయడం జరిగింది. షార్జా పోలీసు - కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్స్ డైరెక్టర్ కల్నల్ ఖలీఫా కలాందర్ మాట్లాడుతూ, అక్రమ యాక్టివిస్టుల్ని అరెస్టు చేసేందుకు ఓ ప్లాన్ ప్రకారం వ్యవహరించినట్లు తెలిపారు. వీకెండ్స్ మరియు సెలవు రోజుల్లో అక్రమ వెండర్స్ సంఖ్య బాగా ఎక్కువగా ఉంటున్నారని చెప్పారాయన. ఫేక్ గూడ్స్, ఫుడ్ ఐటమ్స్ వంటివాటిని విక్రయించేవారే ఎక్కువ వీరిలో. స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆహార పదార్థాలు హానికారకమని అదికారులు తెలిపారు. అరెస్టయినవారిలో ఎక్కువమంది అక్రమ నిర్వాసితులే. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని కల్నల్ కలాందర్ చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







