వేలాది పుస్తకాల పంపిణీ: మినిస్ట్రీ
- September 17, 2016
రియాద్: ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, రియాద్‌లోని విద్యార్థినీ విద్యార్థులకు పెద్ద సంఖ్యలో పుస్తకాల్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది. రియాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మొహమ్మద్ అల్ మోర్షెద్ మాట్లాడుతూ, గత నెలలోనే స్కూలు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యిందన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ స్టూడెంట్స్‌కి కూడా పుస్తకాల్ని పంపినీ చేస్తున్నట్లు చెప్పారాయన. ఎడ్యుకేషనల్ కమిటీ, సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించిందనీ, వీటి ద్వారా స్కూల్ కరికులా సహా పలు వివరాల్ని అందరికీ చేరువయ్యేలా చేస్తోందని వివరించారు మొహమ్మద్. ఇంకో వైపున, సౌదీ మినిస్ట్రీ, సౌదీ ల్యాండ్ మార్క్ కాంపిటీషన్ కోసం 36 మంది మేల్ మరియు ఫిమేల్ అభ్యర్థుల వివరాల్ని ఇటీవలే వెల్లడించింది. చారిత్రక మరియు మోడ్రన్ ల్యాండ్ మార్క్‌పై ఈ కాంపిటీషన్ జరుగుతుంది. సిటిజన్‌షిప్, ఐడెంటిటీ ఆఫ్ సౌదీ అరేబియా మరియు ఇస్లామిక్ ఐడెంటిటీని ప్రమోట్ చేయడానికి ఈ కాంపిటీషన్‌ని నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు అభ్యర్థులకు ట్రైనింగ్ క్యాంప్‌ని ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







