అన్నా హాజారే బయోపిక్ ప్రేక్షకుల ముందుకు ...

- September 17, 2016 , by Maagulf
అన్నా హాజారే బయోపిక్ ప్రేక్షకుల ముందుకు ...

 మరో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాల మధ్య తన కుటుంబ సరక్షణ భాద్యతను స్వీకరించి ప్రస్తుతం అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్న వ్యక్తి అన్నా హజారే. ఈయన గురించి తెలియని భారతీయుడు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇతరుల శ్రేయస్సు కోసం పాల్పడే వ్యక్తిగా అందరి మన్ననలు అందుకున్న హాజరే జీవితంలో ఎన్నో విషాదగాథలు ఉన్నాయట. ఇవన్నీ అన్నా చిత్రంలో చూపించబోతున్నారట. ఈ చిత్రానికి శశాంక ఉదాపుర్కర్ దర్శకత్వం వహిస్తోండగా, ఓ జర్నలిస్ట్ పాత్రలో తానిషా ముఖర్జీ కనిపించనున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో అన్నా చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది.రజిత్ కపూర్, శరత్ సక్సేనా, గోవింద నమడియో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com