దుబాయ్ లో కృత్రిమ రెయిన్ ఫారెస్టు రెస్టారెంట్
- September 18, 2016
దుబాయ్ పేరు వింటేనే ప్రపంచంలోనే ప్రత్యేకమైన నిర్మాణాలు గుర్తొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం నుంచి.. సముద్రంలో పార్కులు నిర్మించగల నైపుణ్యం.. సృజనాత్మకత ఉన్న దేశమది. ఈ అరబ్ దేశం తాజాగా మరో భిన్నమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తమ దేశంలో లేని అడవులను స్వదేశీయులకు.. పర్యాటకులకు పరిచయం చేసేందుకు అపార్టుమెంట్లోనే ఇండోర్ రెయిన్ ఫారెస్టును ఏర్పాటు చేయబోతుంది.
అపార్టుమెంట్‌లో కృత్రిమ రెయిన్ ఫారెస్టు(వర్షారణ్యం)ను నిర్మించే ప్రాజెక్టును చేపట్టింది దుబాయ్. హిల్టన్ అనే సంస్థ ఈ కృత్రిమ రెయిన్ ఫారెస్టు రెస్టారెంట్‌ను దాదాపు రూ.2వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. రెండు భారీ టవర్లు నిర్మించి వాటిలో తొలి ఐదు అంతస్తుల్లో రెయిన్ ఫారెస్టును ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ వృక్షాలు.. మొక్కలు.. జంతువులు ఉంటాయి. ఆ ప్రాంతమంతా వర్షం పడుతుంది.. శబ్ధం వినిస్తుంది. కానీ.. నీటి చుక్క మీద పడదు.ఇసుక లేకుండానే కృతిమ బీచ్ ఏర్పాటు చేస్తారట. అంతేకాదు.. పిల్లలు ఆడుకోవడాడనికి అడ్వంచర్ గేమ్స్ కూడా ఉంటాయట. అదే టవర్లలో నివసించేందుకు.. ఆఫీసులు ఏర్పాటు చేసుకునేందుకు 280 ఇళ్లు.. పర్యాటకుల బస కోసం 450 ఫ్లాట్లు నిర్మిస్తారు. 2018లో ఈ రెయిన్ ఫారెస్ట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ చెబుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







