పాత మిత్రుల కలయిక: జ్ఞాపకాలు, బాధ్యలతో డా.రవి వేమూరు ప్రసంగం
- September 18, 2016
ప్రవాస తెలుగు ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని.. నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయడం తమ ధ్యేయమని ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ డాక్టర్ వేమూరి రవి తెలిపారు. శాన్ ఆంటోనియో (టెక్సాస్)లో నిర్వహించిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గుంటూరు వైద్య కళాశాలలో తన విద్యార్థి జీవితం.. తరువాత అమెరికాలో వైద్య ప్రాక్టీసు, తిరిగి భారత్ కు రావడం, ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ పదవి వరించడం అంతా చెప్పుకొచ్చారు. సమాచారం, సరదా కలగలిపి పాత విషయాలను గుర్తు చేస్తూ కొత్త బాధ్యతలను తెలియజెపుతూ ఆయన ప్రసంగించారు.
ఏపీ ఎన్నార్టీఎస్ లక్ష్యాలు, ప్రవాసాంధ్రుల పాత్ర గురించి కీలకోపన్యాసం చేశారు. అదంతా ఆయన మాటల్లోనే... ‘‘2007 ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలో పర్యటించారు. అప్పటికి అమెరికాలో ఉన్న తనలాంటి వందలాది మందితో ఆయన ఇంటరాక్టయ్యారు.. విదేశాల్లో స్థిరపడినవారిని తిరిగి జన్మభూమి రప్పించే వేదిక ఏర్పాటు చేయాలని తలపోశారు. ప్రవాసాంధ్రులకు సహాయపడేలా ఏపీఎన్నార్టీ సొసైటీని ఏర్పాటు చేశారు. అంతేకాదు... ఏపీ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. జీవీకే, జీఎంఆర్ వంటి తెలుగు సంస్థలను ప్రోత్సహించి అతర్జాతీయ సంస్థలుగా ఎదిగేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు 40 లక్షల మంది తెలుగువారున్నారు. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మంది ఉంటారు. అమెరికాలోని ప్రవాస తెలుగువారు ఏపీలో ఏటా 25 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుంటారు.. కానీ, అందులో అధిక భాగం రియల్ ఎస్టేట్ లోనే పెడుతుంటారు. అలా కాకుండా ఉత్పాదక, ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి సమాజానికి పనికొచ్చేలా ఉండాలన్నది మా అభిమతం.
ఇండియాలో, మరీ ముఖ్యంగా నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ర్ట అభివృద్ధి, స్వీయ ఎదుగుదల రెండూ సాధ్యమవుతాయి. చాలా ప్రపంచ దేశాలు 2 శాతం వృద్ధి రేటు కూడా సాధించలేని తరుణంలో ఇండియా 8 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది. ఏపీ ఏకంగా 11 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అలాంటి చోట పెట్టుబడులు పెట్టడానికి సందేహించనవసరం లేదు. పెట్టుబడులు పెట్టే ప్రవాసులకు తోడ్పడేందుకు... అనుమతులు సులభంగా వచ్చేలా చేయడానికి ఏపీఎన్నార్టీ ఇప్పుడు అండగా కూడా ఉంది. ఇప్పటికే ఏపీఎన్నార్టీఎస్ చొరవతో 130 కంపెనీలు ఏపీకి వచ్చాయి.
- నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కార్యాలయాలు, నివాస స్థలాలు కొనుగోలు చేస్తే వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో మంచి ఆదాయం వస్తుంది.
- ఇండస్ట్రియల్ పార్కులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్తుకేర్ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలం.
- ముఖ్యంగా ఆసుపత్రులు, వైద్య విద్య కళాశాలలు ఏర్పాటు చేయాలి... ఏపీలో వాటి అవసరం ఎంతో ఉంది.
- హెల్తు కేర్ సెక్టార్లో ఐటీ, మొబైల్ హెల్త్ కేర్, వేరబుల్ మెడికల్ డివైసెస్, టెలీ మెడిసన్, హెల్త్ టూరిజం అత్యంత కీలక రంగాలుగా ఉన్నాయి. పార్మష్యూటికల్స్, హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్సుపై దృష్టి పెట్టాలి.
- ఆసక్తి ఉన్న ప్రవాసులకు అనుమతుల ప్రక్రియలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా చేయడం వంటి విషయాల్లో ఏపీఎన్నార్టీఎస్ తోడ్పడుతుంది.
సాధారణంగా పూర్వ విద్యార్థుల సమావేశాలు విందులు, నవ్వులతో జరుగుతాయి. కానీ రవి వేమూరు దానికి కొత్త అర్థం చెప్పారు. సరదా, జ్ఞాపకాలకు బాధ్యతను, భవిష్యత్తును జత చేశారు. జన్మభూమికి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇదేనని, కుటుంబ బాధ్యతలన్నీ తీర్చుకున్నాం ఇక మన ఊరు, మన దేశ బాధ్యతలను కూడా తీర్చాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. అందులోనే మన తర్వాత తరాల భవిష్యత్తు మిళితమై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు వందల మంది వైద్యులు హాజరయ్యారు. కార్యక్రమానంతరం హాజరైన ప్రతి ఒక్కరిలో ఒక సంపూర్ణమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన రోజు గడిపిన ఆనందం పూర్వ విద్యార్థుల మొహాల్లో తొణికిసలాడింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









