థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం..
- September 19, 2016
థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బోట్.. కేవో ఫ్రయా నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మరో 11 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఓ మసీదులో ప్రార్థనలు ముగించుకొని పడవలో తిరిగివస్తుండగా పర్యాటక నగరం ఆయుత్తాయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన పడవ బలమైన అలల తాకిడికి కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయుత్తాయ డిప్యూటీ గవర్నర్ రెవత్ ప్రసోంగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతుల్లో విదేశీయులెవరూ లేరని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







