ఖతార్ లో కీ.శే.ఆచార్య కె.జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

- August 08, 2015 , by Maagulf
ఖతార్ లో కీ.శే.ఆచార్య కె.జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారి 81వ జన్మదిన వేడుకలు ఖతార్ దేశములో "తెలంగాణా ప్రజా సమితి ఖతార్" కార్యవర్గ సభ్యుల అద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 150 మంది సభ్యులు హాజరయి తెలంగాణ సిద్ధాంత కర్త కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ గారి జయంతి ని పురస్కరించుకొని తలచుకొని తెలంగాణా ప్రజా సమితి ఖతార్ సాంస్కృతిక కల బృందం సభ్యులు వారి పాటలతో మరొక్కసారి ఆచార్యుల వారిని గురుతు చేసారు. తెలంగాణా ప్రజా సమితి ఖత్తర్ కార్యవర్గ బృందం అందరు తెలంగాణ సిద్ధాంత కర్త కీ. శే. ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్  గారిని ఆదర్శంగా తీసుకొని బంగారు తెలంగాణా కోసం అందరు కలిసి పనిచయ్యలని నిర్ణయించుకున్నారు. అలాగే ఖత్తర్ లో ఉన్న తెలంగాణా బిదలందరూ కలిసి ఖత్తర్ లో ఉన్న తెలంగాణా ప్రవాసీలకు ఎల్లప్పుడూ తెలంగాణా ప్రజా సమితి తరపున సహాయ సహకారాలు అందిస్తామని కార్యవర్గ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ప్రజా సమితి కార్యవర్గ సభ్యులు శ్రీ ధర్మరాజు , శంకర్ గౌడ్, మహిపాల్ , శ్రీధర్ అబ్బాగొని, కొమురయ్య, మురళి రాజారామ్, వేణుగోపాల్ పడకంటి మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com