వీసా నిబంధనలల్ని సరిచూసుకోండి
- September 19, 2016
రియాద్: నాలుగు సౌదీ ఎంబసీలు, పౌరులకు వీసా నిబంధనల్ని సరి చూసుకోవాల్సిందిగా అప్రమత్తం చేసింది. పలు దేశాల్లో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతో, పౌరులకు ఆ వివరాల్ని ఆయా ఎంబసీలు తెలియజేశాయి. హాంగ్‌కాంగ్‌లోని సౌదీ ఎంబసీ, చైనా వెళ్ళేవారు ఎవరైనాసరే, ఎలక్ట్రిక్ టేజర్స్‌ని తీసుకెళ్ళరాదని సౌదీ ఎంబసీ స్పష్టం చేసింది. రియాద్‌లోని చైనీస్ ఎంబసీ నుంచి వీసా పొందాలనీ, లేదా జెడ్డా నుంచి వీసా పొందవచ్చనీ, ఆన్ ఎరైవల్ వీసా సౌకర్యం లేదని తెలిపింది. గ్రీస్‌లోని సౌదీ ఎంబసీ, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తమతో తీసుకురావాలనీ, ట్రావెల్ మరియు హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటివి సౌదీ ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచే పొందాల్సి ఉంటుందని పేర్కొంది. జపాన్‌లోని సౌదీ ఎంబసీ, ఏయే ప్రాంతాల్లో పర్యటించాలో ముందుగానే లిస్ట్‌ని చెకప్ చేసుకోవాల్సిందిగా పౌరులకు సూచించింది. కెనడాలో సౌదీ ఎంబసీ, మొబైల్ నెంబర్స్‌ని సౌదీలకు అందజేస్తోంది. అత్యవసర సమయాల్లో వారికి సహాయ పడేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఫిలిప్పీన్స్‌లో తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అటువైపుగా వెళ్ళవద్దని మనీలాలోని సౌదీ ఎంబసీ పౌరులను హెచ్చరించింది.
తాజా వార్తలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!







