మరిన్ని ఆసుపత్రులకు హెచ్‌ఎంసి మెటర్నిటీ సేవలు
- September 19, 2016
దోహా: హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్‌ఎంసి) మెటర్నిటీ సర్వీసులను అల్ వక్రా, దుఖాన్, అల్ ఖోర్ ఆసుపత్రులకు విస్తరించడం ద్వారా విమెన్ హాస్పిటల్‌పై బర్డెన్‌ని తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదివరకు పూర్తిగా విమెన్ హాస్పిటల్‌పైనే ఒత్తిడి ఉండేదనీ, ఇప్పుడు ఆ సేవలను విస్తరించడం ద్వారా విమెన్ హాస్పిటల్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా, గర్భిణీ స్త్రీలకు తమకు దగ్గరలో వైద్య చికిత్స పొందడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ ప్రక్రియకు వీలు కలగడం జరుగుతున్నాయి. విమెన్ హాస్పిటల్‌లో రద్దీ 25 శాతం తగ్గగా, అదే సమయంలో నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. 2013లో 18,000 డెలివరీ కేసుల్ని డీల్ చేసిన విమెన్ హాస్పిటల్, 2014లో 16,000 కేసుల్ని మాత్రమే డీల్ చేసింది. ఆ కేసులన్నీ నెట్ వర్క్ హాస్పిటల్స్‌కి తరలి వెళ్ళాయి. అల్ వక్రా 3,673 కేసులతో 77 శాతం వృద్ధిని నమోదు చేయగా, అల్ ఖోర్ హాస్పిటల్‌లో 2014లో 1,197 డెలివరీలు జరిగాయి. అయితే ఇది ఏడు శాతం మాత్రమే.క్యుబన్ హాస్పిటల్‌లో మాత్రం 88 శాతం వృద్ధితో 256 డెలివరీలు జరిగాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







