హైపర్ లూప్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ - ఫ్యూచర్ దుబాయ్
- September 19, 2016
దుబాయ్: ఫ్యూచర్ దుబాయ్, టెక్నాలజీకి వేదిక కానుంది. ప్రపంచంలోని అత్యద్భుత నగరాల్లో ఒకటిగా దుబాయ్ ఇప్పటికే పేరు తెచ్చుకుంది. మరింతగా దుబాయ్‌ని సాంకేతికంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు పలు మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్, ప్రపంచ దేశాలకు చెందిన పలు కంపెనీలను ఆహ్వానించి, కొత్త టెక్నాలజీ ప్రమోషన్‌కి ఆఆ్కరం కల్పిస్తోంది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో అప్లికేషన్లు 70కి పైగా దేశాల నుంచి వచ్చాయి. వాటిల్లో కొన్ని సంస్థల్ని అప్పగించి, పలు ప్రాజెక్టులపై వారి నుంచి డెమోస్‌ని ఆహ్వానిస్తోంది. హైపర్ లూప్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, త్రిడి ప్రింటింగ్, డిజిటల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా ఇప్పటికే హైపర్ లూప్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. కాంతి వేగంతో మనమూ పోటీ పడేందుకు ఈ ప్రయోగాలు ఉపయోగపడ్తాయి. అలాగే రోడ్లపై ప్రమాదాలు తగ్గించేందుకు, డ్రైవల్ లెస్ కార్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇంకో వైపున దుబాయ్ ఫ్యూచర్ యాక్సెలటేర్స్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం మూడు రౌండ్లను కలిగి ఉంటుంది. ప్రతి రౌండ్ మూడు నెలలపాటు ఉంటుంది. ఈ కాలంలో ప్రపంచంలోని బెస్ట్ ఎమర్జిఇంగ్ కంపెనీస్‌ని ఆకర్షించేలా ఈ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారు. పార్టిసిపెంట్లకు శిక్షణ ఇవ్వడం, డెవలప్‌మెంట్, ప్రోటోటైపింగ్, పైలట్ ప్రాజెక్టుల్ని దుబాయ్ సిటీ కోసం రూపొందించడం వంటివి ఇందులో ముఖ్యమైన అంశాలు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత లాభదాయకమైన బిజినెస్ మోడల్‌ని రూపొందించే సమర్థతను సొంతం చేసుకుంటారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







