ఏ.పి రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి విమానాశ్రయాలకు కనెక్టివిటీ...
- September 19, 2016
రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన డైరెక్టర్ ఆర్.ఎన.చౌబేను సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు దేశంలోని ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు, ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్ ఏవియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
రాషా్ట్రనికి అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా వచ్చేలా చేయాలని చౌబేకి సూచించారు. ఏపీలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ఏవియేషన్ అధికారులకు తెలిపారు. విశాఖలో ఏవియేషన్ ఆధ్వర్యంలో పైలట్ టె్త్రనింగ్ సెంటర్ ఏర్పాటుపై సీఎం సూచనపై ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్రో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







