షేక్ రషీద్ వర్ధంతి: ఒక హృదయపూర్వక నివాళి
- September 20, 2016
నేటికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం షేక్ రషీద్ చనిపోయిన విషాదకర రోజు వైస్ ప్రెసిడెంట్ మరియు యు ఏ ఇ ప్రధానమంత్రి మరియు దుబాయ్ పాలకుడు యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం గార్ల పెద్ద కుమారుడు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం యొక్క అన్నయ్య కాబడే షేక్ రషీద్ కేవలం 34 సంవత్సరాల వయసులో కాలం చేశారు. ఆయన తమ్ముడు ఇప్పుడు అతనికి ఘన నివాళీని తన ఇంస్టాగ్రామ్ ద్వారా శ్లాఘించారు. షేక్ హందాన్ యొక్క సామాజిక మీడియా ప్రొఫైల్స్ పరిశీలించి చూస్తే ఆ ఇరువురు సోదరులు అత్యంత సన్నిహితులు మరియు వారి మధ్య ఒక లోతైన అనుబంధం పెనవేసుకొని ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో తన సోదరుని గూర్చి రచించిన " ఒక్కమాట ..నా అన్నయ్య " అనే హత్తుకునే పద్యం తన సోదరునికి కానుకగా ఒక షేర్ చేశాడు. క్రౌన్ ప్రిన్స్ తన ప్రియమైన అన్నయ్య కు చెందిన వీడియోలను గుర్రంస్వారీ, పాఠశాల యూనిఫారాలు యువకునిగా ఆయన చిత్రాలు జ్ఞాపకాలను ఉటంకిస్తూ వీడియోని ముగించారు. షేక్ హందాన్ విడియో చివరలో స్వర్గంకు నిష్క్రమించే ఆత్మల కోసం అరబిక్ లో ఒక ప్రార్థనని పంచుకున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







