అమరులైన ఉరీ జవాన్లకు ఘన నివాళులు
- September 20, 2016
ఉరీ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు వారివారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం అందులో పాల్గొన్నారు. అమరవీరులకు తగిన రీతిలో నివాళులర్పించారు.
ఎక్కడ చూసినా విషాదఛాయలే కనిపిస్తున్నాయి. ఉరీ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్వగ్రామాల్లో విషాదం అలముకుంది. ఇక ప్రాణాలు కోల్పోయిన జవానుల కుటుంబసభ్యుల బాధ వర్ణాణాతీతం.
వారిని ఓదార్చడం ఎవ్వరివల్ల కావడం లేదు. గయకు చెందిన నాయకేస్ విద్యార్థి ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడయ్యాడు. అతడికి గ్రామస్థులు అరుదైన నివాళి అర్పించారు. విద్యార్థి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించేందుకు వీలుగా పాడైన రోడ్లను చదును చేశారు. ఇక అతని మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన జవాన్ గంగాధర్ దల్వీకి హౌరాలో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది సైనికులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగాధర్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. హవల్దార్ ఎస్ఎస్ రావత్ అంతిమయాత్ర అతని స్వస్థలం రాజస్థాన్‌లో జరిగింది. భారీగా జనం తరలివచ్చారు. మహారాష్ట్రలోని సతారాలో లాల్స్‌నాయక్ జీ.శంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. మంగళవాయిద్యాలతో శంకర్ మృతదేహాన్ని ఊరేగించారు. వీరజవాన్ నీకు సలాం అంటూ ఊరంతా గ్రామస్థులు ముగ్గుతో రాశారు. అతని సమాధిని పూలతో అలంకరించారు. ఉత్తర్‌ప్రదేశ్ సంత్‌కబీర్ నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన సిఫాయి గణేశ్ శంకర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







