అభిమానులను ఆకట్టుకున్న నాగభరణం ట్రైలర్..
- September 20, 2016
ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో గ్రాఫికల్ వండర్స్ తెరకెక్కించాలంటే దర్శకుడిగా రాజమౌళి పేరునే సూచిస్తారు. అయితే రాజమౌళి కన్నా ముందే తెలుగు సినిమాకు అద్భుతమైన గ్రాఫిక్స్ ను పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు సినిమాతో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ చూపించిన కోడి, అంజి సినిమా గ్రాఫిక్స్ కు జాతీయ అవార్డ్ ను కూడా సాధించాడు. తాజాగా మరో గ్రాఫికల్ వండర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.ఏడేళ్ల క్రితం మరణించిన కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ హీరోగా ఓ సినిమాను రూపొందించాడు కోడి రామకృష్ణ. చనిపోయిన విష్ణువర్దన్ తెర మీద చూపించేందుకు. 450 మంది గ్రాఫిక్ ఆర్టిస్ట్ లు రెండేళ్ల పాటు శ్రమించారు.సాండల్ వుడ్ గ్లామర్ బ్యూటి రమ్య, సాయికుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో గ్రాఫిక్స్, సాహస సింహ విష్ణువర్దన్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







