పైలట్‌ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది

- September 20, 2016 , by Maagulf
పైలట్‌ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది

సౌదీఅరేబియాకు చెందిన విమానంలోపైలట్‌ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. బోయింగ్‌ 777 విమానం సౌదీలోని జెడ్డా నుంచి పిలిఫ్పీన్స్‌ రాజధానిమనీలాకు బయలుదేరింది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మనీలాలోని నినోయ్‌ ఆక్వినో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా పైలట్‌ పొరపాటున డిస్ట్సెస్‌ కాల్‌ బటన్‌ నొక్కేశాడు. దాంతో విమానం ప్రమాదంలో ఉందనుకుని భద్రతా బలగాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు విమానాన్ని చుట్టుముట్టారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. అయితే అది పైలట్‌ పొరపాటని తెలుసుకుని అంతా వూపిరి పీల్చుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com