బలమైన గాలులు విరుచుకుపడ్తాయ్
- September 20, 2016
ఖతార్: ఖతార్‌లో బుధవారం భారీ గాలులు విరుచుకుపడే అవకాశం ఉందనీ, ఈ కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉండవచ్చని ఖతార్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అయితే తీర ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరికల్ని వెదర్ రిపోర్ట్‌లో పేర్కొనలేదు. గాలుల వేగం 10 నుంచి 20 నాట్స్ ఉండచ్చని, కొన్ని ప్రాంతాల్లో 26 నాట్స్‌కి ఈ వేగం చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. పగలు వేడి ఎక్కువగా ఉంటుందనీ, దుమ్ము ధూళి బాగా ఎగసిపడే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. 3 కిలోమీటర్లు, అంతకన్నా తక్కువగా విజిబిలిటీ కొన్ని ప్రాంతాల్లో పడిపోతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. 41 డిగ్రీల సెంటీగ్రేడ్ మంగళవారం నమోదయ్యింది. గురువారం 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







