దీపావళికి 'సై..తాన్'
- September 20, 2016
ఈ తరం కథానాయకులకి పూర్తి భిన్నమైన పంథాలో కథల్ని ఎంచుకుంటూ విజయాలు సొంతం చేసుకుంటున్నారు విజయ్ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా రాణిస్తున్న సమయంలో హీరోయిజంపై మనసు పారేసుకున్న ఆంటోనీ... తనలోని ప్లస్, మైన్‌సలను తెలుసుకుని తన బాడీలాంగ్వేజ్‌కి తగ్గ కథల్ని ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 'నాన', 'సలీమ్', 'పిచ్చైకారన్' చిత్రాలతో భిన్నమైన నటుడిగా నిలిచారు. ఈ జాబితాలో వస్తున్న మరో చిత్రం 'సైతాన్'. ఇందులోను ఒక వైవిధ్యమైన కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సస్పెన్స్, యాక్షన, ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లర్ ప్రధానంగా తెరకెక్కుతోంది.షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేయగా, వీక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న 'సైతాన్'ను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ సొంతంగా నిర్మిస్తున్నారు. ఆరా సినిమాస్ బ్యానర్‌పై దీపావళికి 'సైతాన్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







