ఆస్ట్రేలియాలోనూ జాతి విభేదాలు పొడసూపుతున్నాయి
- September 20, 2016
ఆస్ట్రేలియాలోనూ జాతి విభేదాలు పొడసూపుతున్నాయి. ఆస్ట్రేలియన్లలో ప్రత్యేకంగా ముస్లింలపై వ్యతిరేక వైఖరి బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. సెనేటర్ పౌలిన్ హాన్సన్ ఇటీవల సెనేట్‌లో ప్రసంగిస్తూ ఆస్ట్రేలియా ముస్లింలతో నిండిపోతోందని ప్రజలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రసంగించిన ఓ వారం తర్వాత ఎసెన్షియల్ మీడియా కమ్యూనికేషన్స్ ఓ పోల్‌ను నిర్వహించింది. ఈ పోల్‌లో ఆస్ట్రేలియాకు ముస్లింలు వలస రావడాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అని ప్రశ్నించింది. సమర్థిస్తున్నట్లు 49 శాతం మంది సమాధానం ఇచ్చారు. 40 శాతం మంది వ్యతిరేకించగా, 11 శాతం మంది తమకు తెలియదని చెప్పారు. ముస్లింలు ఆస్ట్రేలియాకు వలస రావడంపై నిషేధం విధించడాన్ని లేబర్ ఓటర్లలో 40 శాతం మంది సమర్థిస్తున్నారు.లిబరల్, నేషనల్ పార్టీ ఓటర్లలో 60 శాతం మంది, గ్రీన్ ఓటర్లలో 34 శాతం మంది సమర్థిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం ఇమ్మిగ్రేషన్‌పై నిషేధాన్ని సమర్థించడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉగ్రవాద భయమే కారణమని 27 శాతం మంది చెప్పారు. ముస్లింలు ఆస్ట్రేలియా సమాజంలో ఇమడటం లేదని 41 శాతం మంది చెప్పారు.వారు మన విలువలను పంచుకోవడం లేదని 22 శాతం మంది చెప్పగా, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశమని నాలుగు శాతం మంది చెప్పారు. లేబర్ లీడర్ బిల్ షార్టెన్ అడిలాయిడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా వలసదారుల దేశమని, దేశ భవిష్యత్తు ప్రజలంతా కలిసిమెలిసి పనిచేయడంపైనే ఆధారపడి ఉందని చెప్పారు. ఫస్ట్ ఆస్ట్రేలియన్లు మినహా మిగతావారంతా ఏదో ఒక దేశం నుంచి వచ్చినవాళ్ళమేనన్నారు. ఈ దేశంలోని పెద్ద సమస్యలకు మైనారిటీలను బలి పశువులుగా చేయడాన్ని చూడాలని తాను కోరుకోవడం లేదన్నారు
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







