భాగ్యనగరం మళ్లీ బోనమెత్తింది

- August 09, 2015 , by Maagulf
భాగ్యనగరం మళ్లీ బోనమెత్తింది

భాగ్యనగరం లో వీధులన్నీ భక్తి గీతాలతో మార్మోగాయి. ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. పోతరాజుల నృత్యాలు... శివసత్తుల పూనకాలు...నగరంలో సందడి చేశాయి. హైదరాబాద్‌లో బోనాలు వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లాజెల్లా...అంతా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇక నేడు రంగం ద్వారా అమ్మవారు భవిష్యవాణి వినిపించనున్నారు. నగర వీధులన్నీ బోనాలతో సందడిగా.... జంట నగరాల్లో లాల్‌దర్వాజ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగర వీధులన్నీ బోనాలతో సందడిగా మారాయి. రంగురంగుల పూలు, విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆలయాలు...కొత్త శోభను సంతరించకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న-మాదన్న ఆలయాలతో పాటు ఇతర ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. లక్షలాదిగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. మంత్రి తలసాని దర్శించుకుని ప్రత్యేక పూజలు .... లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో హెంమంత్రి నాయినీ నరసింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పత్యేక పూజలు చేశారు. ఇక కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ ఆలయంలో ఎంపీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com