కేపీఎల్‌టీకి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతo..
- September 23, 2016
అస్సాంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ (కేపీఎల్‌టీ)కి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో కేపీఎల్‌టీ అగ్ర నేతలిద్దరు ఉన్నారు. ఓ సైనిక జవానుకు గాయాలయ్యాయి. నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. బోకజాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని బనిపథర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారని, పోలీసు సూపరింటెండెంట్ దేబొజిత్ డ్యూరీ చెప్పారు. కేపీఎల్‌టీకి చెందిన ఇద్దరు అగ్ర నేతలతో సహా ఆరుగురు తీవ్రవాదులు మరణించినట్లు, ఒక సైనిక జవానుకు గాయాలైనట్లు తెలిపారు.ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, మూడు పిస్టల్స్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







