ఫెయిల్యూర్‌ను తిరిగి సక్సెస్ చేసుకోగల ప్రేమికుడి కథే 'మజ్ను'
- September 23, 2016
సహజత్వం, ఊహాజనితం ..సినిమాను ఈ రెండు విధాలుగా విభజించవచ్చు. దీనిలో సహజత్వాన్ని ఎంచుకున్న దర్శ కుడు విరించి వర్మ. తొలి సినిమా 'ఉయ్యాల జంపాల' తో తన తరహా ఏంటో చూపించాడు. ఇప్పుడు నాని కథానాయకుడిగా 'మజ్ను' చిత్రాన్ని రూపొందించాడు. అనూ ఇమ్మాన్యుయేల్, ప్రియా శ్రీ నాయికలుగా నటించారు. వినోదాత్మక ప్రేమ కథ తో తెరకెక్కిన 'మజ్ను' శుక్రవారం విడుదలవుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..'చాలా మంది జీవితంలో ప్రేమ వి ఫలమవుతుంటుంది. అక్కడితో వాళ్ల బంధం ముగుస్తుంది. కానీ కొందరు మాత్రమే ఆ ఫెయిల్యూర్‌ను తిరిగి సక్సెస్ చేసుకోగలుగుతారు. అలాంటి ప్రేమికుడి కథే 'మజ్ను'. ఆ మజ్ను లా ఈ ప్రేమికుడి కథలో విషాధం ఉండదు. నవ్వులతో సరదాగా ఉంటుంది. ఒక నాయికను తీసుకుని పేరు 'మజ్ను' అని పెడితే, సీరియస్ ప్రేమ కథ అనుకుంటారు. సినిమాపై ఆసక్తి కలిగించేందుకే ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాం. అయితే కథ చివరకు ఒక నాయికే మిగులుతుంది. నాని గత చిత్రాలు విజయవంతమయ్యాయనే ఒత్తిడి దర్శకుడిగా నాపై లేదు. నాని కి సక్సెస్ ఉండటం వల్ల నా కథను కూడా మరింత సానుకూలంగా ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం కలిగింది. నాని నటన అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈ కథ రాసుకున్నప్పుడే అతను నటిస్తే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా లో రాజ్ తరుణ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. మన చుట్టూ జరుగుతున్నట్లు ఉండే కథలతో సినిమాలు రూపొందించడాన్ని ఇష్టపడతాను.' అన్నారు. చిత్ర కథానాయిక అను ఇమ్మాన్యూుయేల్ మాట్లాడుతూ..' నేను అమెరికా అమ్మాయిని, నా మలయాళ సినిమా 'యాక్షన్ హీరో బిజ్జూ' చూసి ఈ దర్శకులు నన్ను సంప్రదించారు. తెలుగులో ఒప్పుకున్న మొదటి సినిమా 'ఆక్సీజన్'. రెండో సినిమా 'మజ్ను'. అయితే ముందు విడుదలవుతున్న చిత్రమిదే. 'మజు'్నలో పల్లెటూరి సంప్రదాయమైన అమ్మాయిగా కనిపిస్తాను. నడక, నడత అంతా చాలా మంది తెలుగు అమ్మాయిలతో పోల్చుకోవచ్చు. తన లోకంలో బతికే అమ్మాయి పాత్ర నాది. ఇలాంటి యువతి జీవితంలోకి వచ్చిన అబ్బాయే మజ్ను. ఈ సినిమా నాకో మంచి అనుభవంగా మిగిలింది.' అన్నారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







