మాస్కోలో ఘోర ప్రమాదం..
- September 23, 2016
రష్యా రాజధాని మాస్కో నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాస్కో తూర్పు ప్రాంతంలోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడానికి వెళ్లారు. విధినిర్వహణలో ఉన్న ఆ సిబ్బందిలో 8 మంది మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ప్లాస్టిక్ వస్తువులు ఉన్న గిడ్డంగిలో గురువారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున మంటలు ప్రారంభంకాగా..అగ్నిమాపక సిబ్బంది అదుపుచేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు మాస్కో అత్యవసర విభాగం మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. గిడ్డంగి నుంచి రాత్రి వంద మంది కార్మికులను సురక్షితంగా ఖాళీ చేయించారు. భవనం కూలడంతో.. మంటలు ఆర్పడానికి భవనంపైకి ఎక్కిన అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







