మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు రెడీ అయ్యింది...

- September 23, 2016 , by Maagulf
మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు రెడీ అయ్యింది...

మన దేశంలో ఒక్కొక చోట ఒక్కోలా జరుపుకొనే దసరా ఉత్సవాలకు ప్రతి చోట ఒక ప్రాసస్యం ఉంది. ఇక దసరా అనగానే ముందుగా అందరి మదిలో మెదిలేది.. మైసూర్ ప్యాలెస్. దసరా ఉత్సవాలకు చారిత్రక నేపద్యమున్న మైసూర్ ఫ్యాలెస్ రెడీ అయ్యింది. అక్టోబర్ 1 నుంచి 10 వరకూ జరిగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అంగరంగ వైభంగా తయారు చేస్తున్నారు. ఈ నెల 25న నవగ్రహ, గణపతి హోమం, శాంతిపూజలుంటాయి. అదే రోజున సింహాసనాన్ని సిద్ధం చేసే ప్రక్రియను చేపడతారు. అక్టోబరు 1న మహారాజు యధువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు సింహాసాన్ని అధిష్ఠిస్తారు. నిత్యం ప్రైవేట్ దర్భార్ ను కూడా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల నేపద్యంలో ప్యాలెస్ సందర్శనపై ఆంక్షలను అమలు చేస్తారు. ఏయే సమయంలో ఫ్యాలెస్ సందర్శనం కు అవకాశం ఉంటుందో త్వరలో ప్రకటిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com