ఎయిర్పోర్ట్ సిబ్బంది అరెస్ట్
- September 23, 2016
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహచరులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను దొంగిలించడం, కంప్యూటర్ సిస్టమ్‌లోని సమాచారాన్ని తస్కరించడం, డబ్బు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌లోకి ఇతరుల్ని అనుమతించడం వంటి చర్యలకు పాల్పడినందున ఆ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. జోర్డాన్‌కి చెందిన వ్యక్తి ఒకరు, అక్రమంగా కువైట్‌లో నివసించేందుకుగాను ఎయిర్పోర్ట్ ఉద్యోగిని సంప్రదించగా, అతనికి సహకరించేందుకు ఆ ఉద్యోగి ముందుకొచ్చాడు. అయితే, జోర్డానియన్ని పోలీసులు అక్రమ నివాసితుడిగా అరెస్ట్ చేయడంతో, ఎయిర్పోర్ట్ ఉద్యోగి బాగోతం వెలుగు చూసింది. సిసిటివి కెమెరాల ద్వారా నేరాన్ని నిరూపించారు పోలీసులు. దాంతో నిందితుడు, తాను తప్పు చేయలేదని బుకాయించడానికి కూడా వీల్లేకుండా పోయింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









