వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు
- September 23, 2016
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఖాతా డిలీట్ చేసే వారి సమాచారాన్ని, వివరాలను వాట్సాప్ తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే వారి సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోవద్దని వాట్సాప్‌కు తెలిపింది. ఇటీవల వాట్సాప్ సమాచారాన్ని తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈరోజు విచారించింది. డిలీట్ చేసిన ఖాతాల వివరాలను వాట్సాప్ కూడా తొలగించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పుచెప్పింది. వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్‌లను కూడా ట్రాయ్ కిందకు తీసుకురావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.
కొత్త ప్రైవసీ పాలసీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా ఇతరులెవ్వరూ మెసేజ్‌లు చదవలేరని.. ఈ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో వాట్సాప్ కోర్టుకు వెల్లడించింది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత కొద్దిరోజుల క్రితం వాట్సాప్ ప్రైవసీ పాలసీలో పెద్ద మార్పు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతితో వారి ఖాతా సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకునే విధంగా పాలసీని మార్చింది.దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







