ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అరెస్ట్‌

- September 23, 2016 , by Maagulf
ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అరెస్ట్‌

కువైట్‌: కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహచరులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను దొంగిలించడం, కంప్యూటర్‌ సిస్టమ్‌లోని సమాచారాన్ని తస్కరించడం, డబ్బు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌లోకి ఇతరుల్ని అనుమతించడం వంటి చర్యలకు పాల్పడినందున ఆ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జోర్డాన్‌కి చెందిన వ్యక్తి ఒకరు, అక్రమంగా కువైట్‌లో నివసించేందుకుగాను ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని సంప్రదించగా, అతనికి సహకరించేందుకు ఆ ఉద్యోగి ముందుకొచ్చాడు. అయితే, జోర్డానియన్‌ని పోలీసులు అక్రమ నివాసితుడిగా అరెస్ట్‌ చేయడంతో, ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగి బాగోతం వెలుగు చూసింది. సిసిటివి కెమెరాల ద్వారా నేరాన్ని నిరూపించారు పోలీసులు. దాంతో నిందితుడు, తాను తప్పు చేయలేదని బుకాయించడానికి కూడా వీల్లేకుండా పోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com