నగరంలో వరద బాధితులకు 'మా' చేయూతనిచ్చింది..

- September 24, 2016 , by Maagulf
నగరంలో వరద బాధితులకు 'మా' చేయూతనిచ్చింది..

నగరంలోని వరద బాధితులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చేయూతనిచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 'మా' ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మా అధ్యక్షడు రాజేంద్రప్రసాద్, సభ్యుడు శివాజీరాజా ఆల్విన్‌ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఇప్పటికే చాలా మంది నటులు బాధితులకు ధైర్యం చెప్పే పోస్టింగులను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్ తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com