లగన్‌ సారా

- September 24, 2016 , by Maagulf
లగన్‌ సారా

కావలసినవి: కారెట్‌ 100 గ్రా, పచ్చి బఠాణీలు 50 గ్రా, బీన్స్‌ 50 గ్రా, చిలకడ దుంప 200 గ్రా, ఆలు 100 గ్రా, ఉల్లిపాయలు పావుకిలో, టమోటా 200 గ్రా, బెల్లం 50 గ్రా, వినెగర్‌ రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ 45 గ్రా, నూనె 35 గ్రా, పసుపు కొద్దిగా, ఉప్పు, కారం తగినంత. కొంచెం కరివేపాకు.

ఎలా చేయాలి: ఉల్లిపాయలు, టమోటాలతో సహా అన్ని కూరగాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. మూకుట్లో నూనెవేసి ముందు ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలపండి. తర్వాత టమోటా ముక్కలు, మసాలాలు వేయండి. అవి కొంచెం వేగాక కూరముక్కలన్నీ వేసి బెల్లం, వినెగర్‌ కలపండి. నూనె పైకి తేలేంతవరకు ఉంచి విడిగా తిరగమోత వేసి కలపండి. ఎండుమిర్చి, కరివేపాకు ఎక్కువ వేస్తే చూడ్డానికి బావుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com