ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది...

- September 25, 2016 , by Maagulf
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది...

ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఒడిశాకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాను పితబస్‌ మాఝీ(30) శనివారం రాత్రి కన్నుమూశాడు. దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 19కి చేరింది. గత ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో మాఝీ ఒకరు. నౌపడ జిల్లాలోని దనజోల గ్రామానికి చెందిన మాఝీ 2008లో బీఎస్‌ఎఫ్‌లో చేరాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి వద్దామని అనుకున్న జవాను విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాఝీ ఈనెల 22న భార్యతో మాట్లాడాడు. త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తానని ప్రమాణం చేసిన భర్త ఇకలేడనే వార్తను తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. అంత్యక్రియల నిమిత్తం మాఝీ పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com