డిఎన్‌ఎ శాంపిల్స్ కొత్త వివాదం
- September 25, 2016
కువైట్: 2015 జులైలో పార్లమెంటు చేసిన డిఎన్‌ఎ చట్టం తాజాగా ఇంకోసారి చర్చనీయాంవమవుతోంది. 1.2 మిలియన్ సిటిజన్స్ అలాగే 2.3 మిలియన్ ఫారినర్స్‌కి సంబంధించిన డిఎన్‌ఎని సేకరించే దిశగా కువైట్ నిర్ణయం తీసుకుంది. అయితే, డిఎన్‌ఏ వివరాలు బయటకు వెళ్ళడయినట్లయితే ఆయా వ్యక్తుల ప్రైవసీకి దెబ్బ కలుగుతుందనే విమర్శలున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌ల కోసం డిఎన్‌ఏ వివరాలు తప్పనిసరి చేయడంతో, ఇంకోసారి ఈ అంశం చర్చకు వస్తోంది. గత ఏడాది 100 మందికి పైగా ఫోర్జరీ సర్టిఫికెట్లతో కువైటీ సిటిజన్‌షిప్ పొందిన నేపథ్యంలో డిఎన్‌ఏ పరీక్షలు దానికి విరుగుడుగా అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డ్యుయల్ సిటిజన్ షిప్ పొందేవారికి ఈ డిఎన్‌ఏ పరీక్షల కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. కుటుంబ జీవితాలూ గందరగోళం పడే ప్రమాదం ఉంది. ఈ అంశం గురించి పలువురు ప్రస్తావిస్తుండడంపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, కేవలం డిఎన్‌ఎ వివరాలు జ్యుడీషియరీకి మాత్రమే పరిమితమవుతాయనీ, ఇవి బహిర్గతమయ్యే అవకాశం లేదు గనుక, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకూ ఇబ్బంది ఉండదనీ తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు స్పష్టతనిస్తోంది. తన పిల్లల విషయంలో ఓ తండ్రికి అనుమానం వచ్చినాసరే, ఆ వివరాల్ని వెల్లడించే ఆస్కారమే లేదని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టంగా చెప్పింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







