భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచంలో అగ్ర స్థానం..
- September 25, 2016
అత్యధిక సినిమాలను రూపొందిస్తూ భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉందని డెలాయిట్ నివేదక స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని రామెజీ ఫిలిం సిటీలో జరుగుతున్న 'ఇండీవుడ్ కార్నివాల్' లో డెలాయిట్ నివేదికను ఇండీవుడ్ ప్రాజెక్ట్ డైరక్టర్ సోహన్ రాయ్ విడుదల చేశారు. ప్రస్తుత భారతీయ సినిమా పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలు, దృష్టి కేంద్రీకరించాల్సిన విషయాలను నివేదకి వివరించింది. మొత్తం దేశంలోని 20 భాషల్లో ఏడాదికి 1500 నుంచి 2000 సినిమాల రూపకల్పన జరుగుతోందని, ఇది హాలీవుడ్ కంటే చాలా ఎక్కువని గణాంకాలతో సహా నివేదిక స్పష్టం చేసింది. ఏటా దేశీయ సినిమాల బాక్సాఫీస్ రెవెన్యూ 14 వేల కోట్ల రూపాయలుగా ఉందని, ఇది 2020 కల్లా మరో 11 శాతం పెరుగుతుందని ఈ సర్వే అంచనా వేసింది.డెలాయిట్ నివేదిక ఆవిష్కరించిన అనంతరం సోహన్ రాయ్ మాట్లాడుతూ.' మొత్తం భారతీయ సినిమా సమగ్రత కోసం తయారుచేసిన తొలి నివేదిక ఇది. మన సినీ పరిశ్రమను పూర్తిగా అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికకు ప్రతి సినిమా పరిశ్రమ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.ఇంత ముఖ్యమైన సర్వేను ఆవిష్కరించడం కోసం ఇండీవుడ్ కార్నివాల్ కంటే గొప్ప వేదిక ఉండదు.' అన్నారు. ఈ నెల 24న ప్రారంభమైన 'ఇండీవుడ్ కార్నివాల్' ఉత్సాహంగా జరుగుతోంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కార్నివాల్ లో మొత్తం 15 ఈవెంట్లను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







