నరుడా..డోనరుడా ట్రైలర్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నాడు
- September 26, 2016
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కీ డోనర్ రీమేక్ గా సుమంత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం నరుడా.. డోనరుడా. ఈ సినిమా ఫుల్ లెన్త్ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని సుమంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ' నా ఫ్రెండ్ మహేష్ బాబు చేతుల మీదుగా నరుడా.. డోనరుడా ఎక్స్ క్లూజివ్ ఫుల్ లెన్త్ ట్రైలర్ మంగళవారం రిలీజ్ కాబోతోంది..' అంటూ సుమంత్ సోమవారం ట్వీట్ చేశాడు.ఇంతకముందే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ పోస్టర్స్ సూపర్ ఫన్నీగా కనిపిస్తుండటంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇందులో సుమంత్ స్పెర్మ్ డోనర్ పాత్రలో నటించనున్నాడు.రేపు విడుదల కాబోయే కొత్త ట్రైలర్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.కాగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రీమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ పతాకాలపై వై. సుప్రియ, జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. హీరోయిన్‌గా పల్లవి సుభాశ్, కీలక పాత్రలో తనికెళ్ల భరణి నటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







