బిచ్చగాడు నిర్మాతల కొత్త చిత్రం
- September 26, 2016
బిచ్చగాడు వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. ఓ ఫ్రాడ్‌స్టర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కాన్సెప్ట్ తో రూపొంది మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఆన్ మరియ కలిప్పిలాను' తెలుగులో 'పిల్ల రాక్షసి' పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. బిచ్చగాడు చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన ఆ సినిమా సక్సెస్‌లో భాగమైన రచయిత భాషా శ్రీ మలయాళ చిత్రం ఆన్ మరియ కలిప్పిలాను తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందిస్తున్నారు. పిల్ల రాక్షసి సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మిథున్ మాన్యూల్ థామస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రియలిస్టిక్ పంథాలో ఆవిష్కరించగా, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో పాటు, మ్యూజిక్ ఆద్యంతం రక్తికట్టించేలా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఓకే బంగారం ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా, సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది. సన్ని వాయ్‌నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







