' ఎమ్ ఎస్ ధోని' ఏకంగా 60 దేశాల్లో 4500 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది...!
- September 27, 2016
బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వరుసగా తెరకెక్కుతున్న క్రీడాకారుల బయోపిక్స్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే బాటలో భారత క్రికెట్ కెప్టెన్ ధోని జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమ్ ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది.
ఇప్పటికే ప్రమోషన్ పరంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న ధోని సినిమా, మరో అరుదైన ఘనతను సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ లు, మెగాస్టార్ లు నటించిన సినిమాలు కూడా ఇప్పటి వరకు 50 దేశాలకు మించి రిలీజ్ కాలేదు. కానీ ఎమ్ ఎస్ ధోని మాత్రం ఏకంగా 60 దేశాల్లో 4500 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరున్న ధోని బయోపిక్ కోసం అంతర్జాతీయ క్రీడాభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓ సాధారణ టికెట్ కలెక్టర్ ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్ గా మారిన క్రమాన్ని సినిమాటిక్ గా రూపొందించిన ఈ సినిమాలో, ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కనిపిస్తున్నాడు. ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోని చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







