'APNRT' కి 86 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్రభుత్వం అనుమతి ..
- September 27, 2016
వీరపనేనిగూడెం ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా తయారుచేసేందుకు APNRT కి 86 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ మేరకు పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించారని ఏపీఐఐసీ డీజీఎం శరత్‌బాబు చెప్పారు.శరత్‌బాబు ఆధ్వర్యంలోని పారిశ్రామికవేత్తల బృందం సోమవారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని కొండపోరంబోక సర్వే నంబర్ 192/7బీ భూములను సందర్శించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి ఇండస్ట్రిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాజధానిలో పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించగా, వీరపనేనిగూడేన్ని సూచించారని చెప్పారు. ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఒక్కో పరిశ్రమకు రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకూ పెట్టుబడులు పెడతారన్నారు. డాక్టర్ నన్నపనేని మురళీ మాట్లాడుతూ రాబోయే తరానికి మంచి భవిష్యత్ అందించే లక్ష్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ పరిశ్రమలు చేస్తున్నట్లు చెప్పారు టెక్నాలజీ ని ఎపికి ట్రాన్స్ ఫర్ చేసేందుకు కృషి చేస్తున్నాము. పారిశ్రామికవేత్త వేణుబాబు మాట్లాడుతూ పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న తాము డిప్లొమా, ఐటీఐ వారికి ఉపాధిని అందిస్తామన్నారు
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







