ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ రసాయన దాడికి సిద్ధమవుతోంది..
- September 27, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వద్ద రసాయన ఆయుధాలున్నాయని, అది రసాయన దాడికి సిద్ధమవుతోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. రసాయన ఆయుధాలతో భయంకర దాడులకు పాల్పడే అవకాశముందని పెంటగాన్ అధికార ప్రతినిధి తెలిపారు. గత వారం ఇరాక్‌లో రసాయన పదార్థంతో కూడిన రాకెట్ అమెరికా దళాలకు సమీపంలో వచ్చి పడిన నేపథ్యంలో పెంటగాన్ స్పందించింది. గత మంగళవారం ఐఎస్ ప్రయోగించిన రాకెట్ ఖయ్యారా వెస్ట్ బేస్‌లో పడింది. ఆ ప్రాంతానికి కొంత దూరంలోనే వందలాది అమెరికా దళాలు ఉన్నాయి. మోసుల్ నగరాన్ని ఉగ్రవాదుల చెర నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అమెరికా దళాలు వైమానికి దాడికి సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
గత వారం పడిన షెల్‌ను పరీక్షించగా అందులో రసాయన పదార్థం మస్టర్డ్ ఏజెంట్ ఉన్నట్లు తేలింది. దీనిపై ఇంకా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలో కూడా ఐఎస్ ఇలా రసాయన ఆయుధాలు ప్రయోగించే ప్రయత్నం చేసిందని పెంటగాన్ అధికార ప్రతినిధి డేవిస్ తెలిపారు.ఖయ్యారా ప్రాంతంలో శుక్రవారం అమెరికా ఆధ్వర్యంలో జరిగిన వైమానిక దాడుల్లో ఉగ్ర సంస్థకు చెందిన రసాయన ఆయుధాల కర్మాగారాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఈ నెలలో ఐఎస్ రసాయన ఆయుధాలపై ఇది రెండో వైమానిక దాడి. ప్రస్తుతానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు రసాయన ఆయుధాలను ప్రయోగించడంలో కచ్చితమైన నైపుణ్యం లేనప్పటికీ అమెరికా, ఇరాక్ దళాలు ఐఎస్ రసాయన దాడి ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని డేవిస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







