'కాటమరాయుడు' షూటింగ్ మొదలైంది....
- September 27, 2016
ఈ ఫొటో చూశారా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..తెల్లని పంచె..తెల్లని చొక్కా..నున్నగా గీసిన గడ్డం..ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం ఆయన 'పి.శరత్ మరార్' నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో 'పవన్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'కాటమరాయుడు'గా నామకరణం కూడా చేసేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్పుడే మొదలైంది. కానీ షూటింగ్ లో 'పవన్' పాల్గొనలేదు. షూటింగ్ కంటే ముందు ఆయన బెంగళూరులో జిమ్ లో కసరత్తులు చేశారని టాక్. సోమవారం నాడు ప్రారంభమైన షూటింగ్ కు 'పవన్' వచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత 'శరత్ మరార్' 'పవన్' ఫొటోను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.వీలైంతన తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని 'పవన్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్'లో 'పవన్'తో తొలిసారి జోడీ కట్టిన 'శ్రుతి హాసన్' ఈ సినిమాలో రెండోసారి నటించనున్నారు. ఫ్యాక్షనిస్ట్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







