ఉబర్‌ క్యాబ్‌ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది...

- September 28, 2016 , by Maagulf
ఉబర్‌ క్యాబ్‌ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది...

 ఉబర్‌ క్యాబ్‌ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. కొత్తగా ఆహార సరఫరా విభాగంలోకి అడుగుపెట్టింది. మంగళవారం నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉబర్‌ ఈట్స్‌ పేరుతో మీల్‌ డెలివరీ సర్వీసును కూడా ప్రారంభించింది. దీనిని త్వరలో 22 దేశాల్లో విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. వీటిల్లో ఇప్పటికే ఉబర్‌ క్యాబ్‌సర్వీసులు నిర్వహిస్తున్న ఆరు ప్రధాన దేశాలు కూడా ఉన్నాయి.ఉబర్‌ మేలో తన ప్రధాన వ్యాపార మార్గాలను విస్తరించాలని భావించింది. దీనిలో భాగంగా ఉబర్‌ఈట్స్‌ను ప్రారంభించింది. గత మూడు నెలలుగా దీనికి సంబంధించిన ఉద్యోగులను నియమించుకుంటోంది.దీనిపై ఉబర్‌ ఈట్స్‌ యూరోప్‌ విభాగం హెడ్‌ జంబు పళనియప్పన్‌ మాట్లాడుతూ ఈ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని, ఉబర్‌ సర్వీసులు నిర్వహించే పట్టణాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరికి దుబాయ్‌, జొహన్నెస్‌బర్గ్‌ వంటి పట్టణాలకు విస్తరిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com