హైదరాబాద్లో మొదలైన బతుకమ్మ సంబరాలు

- September 29, 2016 , by Maagulf
హైదరాబాద్లో మొదలైన బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక హనుమాన్‌ దేవాలయం సమీపంలోని మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలుబతుకమ్మలతో ప్రదర్శనగా వచ్చి ఆడి, పాడారు. అంతకు ముందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరళ్ల శారద బతుకమ్మతో వచ్చి మహిళలతో ఆడి పాడారు. ఈ సందర్భంగా సావిత్రమ్మ రాసిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మహిళలు వూరేగింపుగా వెళ్లి రంగదాముని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com