సార్క్ సదస్సు వాయిదా, ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తాం - పాకిస్తాన్
- September 30, 2016
సార్క్ సదస్సును పాకిస్థాన్ వాయిదా వేసుకోక తప్పలేదు. ఉరీ ఉగ్ర ఘటన నేపథ్యంలో భారత్‌తో పాటు సభ్యదేశాలు ఈ సమావేశానికి హాజరుకాబోమని తేల్చిచెప్పడంతో సదస్సును వాయిదా వేస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు.
నవంబర్ 9,10 తేదీల్లో ఇస్లామాబాద్‌లో 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఉరీ ఘటన నేపథ్యంలో పాక్, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ సమావేశాలకు హాజరయ్యేది లేదని భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలనే సంకల్పంతో తీసుకున్న మోదీ నిర్ణయానికి సార్క్ సభ్యదేశాలు బాసటగా నిలిచాయి.
మోదీ నిర్ణయం ప్రకటించిన వెంటనే భారత్‌కు మద్దతిస్తూ బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్లు తాము ఈ సదస్సులో పాల్గొనబోమని స్పష్టం చేశాయి. తాజాగా శ్రీలంక, మాల్దీవులు కూడా సార్క్‌కు హాజరుకాబోమని ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు తెలిపాయి. దీంతో సదస్సుకు హాజరుకాని దేశాల జాబితా ఆరుకు చేరింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







