కోల్కత్తా థియేటర్లో అగ్నిప్రమాదం....
- October 02, 2016
పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతాలోని అతిపురాతనమైన సినిమా థియేటర్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దయెత్తున చెలరేగిన మంటలతో సినిమా హాల్ మొత్తం కాలి బూడిదైపోయింది. స్థానికుల సమాచారంతో 26 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1930లో ఈ సినిమా థియేటర్‌ను నిర్మించారు. 2008 నుంచి ఇందులో చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన 'షోలో' చిత్రం ఈ థియేటర్లో 103 వారాల పాటు నిర్విరామంగా ఆడి రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







