కోల్‌కత్తా థియేటర్‌లో అగ్నిప్రమాదం....

- October 02, 2016 , by Maagulf
కోల్‌కత్తా థియేటర్‌లో అగ్నిప్రమాదం....

పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతాలోని అతిపురాతనమైన సినిమా థియేటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దయెత్తున చెలరేగిన మంటలతో సినిమా హాల్‌ మొత్తం కాలి బూడిదైపోయింది. స్థానికుల సమాచారంతో 26 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1930లో ఈ సినిమా థియేటర్‌ను నిర్మించారు. 2008 నుంచి ఇందులో చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. బాలీవుడ్‌ నటుడు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర నటించిన 'షోలో' చిత్రం ఈ థియేటర్‌లో 103 వారాల పాటు నిర్విరామంగా ఆడి రికార్డు సృష్టించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com