సరైన సమయంలో వేతనాల కోసం కొత్త చట్టం
- October 03, 2016
క్టోబర్ 3 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం ద్వారా యూఏఈలోని కార్మికులు సకాలంలో వేతనాలు అందేందుకు మార్గం సుగమం అవుతుంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ బిన్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ జారీ చేసిన డిక్రీ ద్వారా, 100కి పైగా కార్మికులు గల కంపెనీలు రిజిస్టర్ పే సమయానికి 10 రోజుల్లోపే వేతనాల్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో 16వ రోజు నుంచీ, ఆ కంపెనీ కొత్తగా ఎవరికీ వర్క్ పర్మిట్లు జారీ చేయకుండా నిషేధం విధిస్తుంది. లేబర్ మార్కెట్‌ని స్టేబిలైజ్ చేయడానికి వీలుగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఫర్ ఇన్స్పెక్షన్స్ మెహెర్ అల్ ఒబెద్ చెప్పారు. ప్రధానంగా జీతాల సమస్యను నిరోధించే దిశగా ఈ చట్టం వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. నెల రోజులపాటు గనుక వేతనాలు చెల్లించని పక్షంలో, సదరు సంస్థ గురించి మినిస్ట్రీ జ్యుడీషియరీకి రిఫర్ చేస్తుంది. తదనంతరం అవసరమైన చర్యల్ని తీసుకుంటుంది. 60 రోజులపాటు జీతాలు చెల్లించకపోతే, కఠినంగా జరీమానాల్ని విధిస్తారు. ఒక్కో వర్కర్‌కీ 5,000 దిర్హామ్‌ల చొప్పున కంపెనీకి జరీమానా విధించడం జరుగుతుంది. 100 మంది లోపు కార్మికులకు మాత్రం ఇదివరకు ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







