ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు మంతనాలు
- October 03, 2016
భారత్, పాక్ మధ్య మూడు వారాలుగా ద్వైపాక్షిక ఉద్రికతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తలను తొలగించేందుకు ప్రయత్నించాలని ఉభయులూ అంగీకరించినట్టు పాకిస్తాన్ జియో టీవీ సోమవారంనాడు తెలిపింది. అజిత్ దోవల్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ మధ్య సంభాషణలు జరిగినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీప్ సలహాదారు సర్తాజ్ అజిజ్ ధ్రువీకరించారని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు కశ్మీర్ అంశంపై మరింత దృష్టి సారించాలని కూడా పాక్ కోరుకుంటున్నట్టు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారని డాన్ పత్రిక తెలిపింది.'కశ్మీర్ అంశం పరిష్కారం కానంతవరకూ సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉంటాయని ఇటీవల అమెరికా పర్యటనలో నవాజ్ షరీఫ్ ప్రపంచదేశాలకు చెప్పడం కూడా జరిగింది' అని సర్తాజ్ అజిజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







