అబుధాబీ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించనున్న మోదీ!

- August 14, 2015 , by Maagulf
అబుధాబీ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించనున్న మోదీ!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుధాబీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యా న్ వారి ఆహ్వానంపై యు. ఏ. ఈ. లోనే అతిపెద్డదైన షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును అగ స్టు 17 న సందర్శించనున్నారు. అదేరోజు అబుధాబీలో 26,000 మంది శ్రామికులుందే అతి పెద్దదైన ఇంటర్నేషనల్ సిటీ లోనున్న భారతీయులను కలసి సావకాశంగా ముచ్చటిస్తారు. ఇంకా, ఆయన యువరాజు వారిని, ఇతర ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతారని ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ శ్రీ వికాస్ స్వరూప్ తెలిపారు. ఇక, దుబాయి క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగే మోడీ ప్రసంగ కార్యక్రమానికి భారీ స్థాయిలో 50,000 మంది హాజరవగలరని అంచనా.


--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com