సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబరు 150'..
- October 03, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీ నంబరు 150' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కాబోతోంది. చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ ప్రకటనను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రామ్చరణ్ మాట్లాడుతూ.. '70 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. నాన్నగారు డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్పటివరకూ చక్కని ఔట్పుట్ వచ్చిందన్న సంతృప్తి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబరు 150' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు.కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..







