సౌదీ వెళ్లిన వైఎస్సార్ జిల్లా వాసి మృతి..
- October 04, 2016
బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన వైఎస్సార్ జిల్లా వాసి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన కోముద్ది హైదర్‌వలీ(48) కొన్నేళ్లుగా బొరుగుల వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. ఇతనికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు. కుటుంబ పోషణకు సంపాదన చాలక పోవటంతో సౌదీ అరేబియా వెళ్లి మెరుగైన జీవనోపాధి పొందాలనుకున్నాడు. ఈ మేరకు అతడు ఇరవై రోజుల క్రితం సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వెళ్లాడు. విధి నిర్వహణలో భాగంగా గత నెల 25వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం కన్నుమూశాడు.ఈ మేరకు అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం చెన్నై ఎయిర్‌పోర్టుకు అతని మృతదేహాన్ని తీసుకువస్తున్నట్లు బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







