అలెప్పో పేలుళ్ళలో క్యుఆర్‌సిఎస్ హాస్పిటల్ ధ్వంసం
- October 04, 2016దోహా: అలెప్పోలో జరిగిన దాడిలో ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (క్యుఆర్‌సిఎస్) నిర్వహిస్తున్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ధ్వంసమయ్యింది. అల్ సఖూర్ ఏరియాలో ఈ హెల్త్ సెంటర్ నిర్వహించబడ్తోంది. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్ ద్వారా విడిచిన నాలుగు బాంబులు తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చాయి. 50 శాతం మెడికల్ సెంటర్ ఈ దాడుల్లో ధ్వంసమయినట్లు క్యుఆర్‌సిఎస్ వర్గాలు వెల్లడించాయి. దాడి కారణంగా, హెల్త్ సెంటర్ పూర్తిగా మూసివేయబడింది. క్యుఆర్‌సిఎస్ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించింది. సిరియాలో క్యుఆర్‌సిఎస్ ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ దాడిని యుద్ధ నేరంగా పరిగణించాలని క్యుఆర్‌సిఎస్ హెల్త్ ప్రోగ్రామ్ హెడ్ - మిషన్ ఇన్ టర్కీ - డాక్టర్ హషీమ్ దార్విష్ డిమాండ్ చేశారు. ఏప్రిల్‌లో ఈ కేంద్రం ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







