అక్టోబర్‌ 16 నుంచి ఖతార్‌లో రెయినీ సీజన్‌

- October 04, 2016 , by Maagulf
అక్టోబర్‌ 16 నుంచి ఖతార్‌లో రెయినీ సీజన్‌

అక్టోబర్‌ 16న కతార్‌లో రెయినీ సీజన్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. 52 రోజులపాటు ఈ సీజన్‌ కొనసాగనుందని ఖతార్‌ మెటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. అక్టోబర్‌ 16కి ముందే వర్షాలు దేశంలో కురవవచ్చునని అంచనా వేస్తున్నారు. వర్షాకాలం సందర్భంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. 30 నుంచి 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. వర్షాలు పొంచి ఉన్నందున సంబంధిత శాఖలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు చేపట్టాల్సి ఉందని మెటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ సూచించింది. ఇదిలా ఉండగా మినిమమ్‌ టెంపరేచర్‌ ఇప్పటికే 20 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కిందకి పడిపోయింది మెసైయీద్‌, తురాయానా, అబు సమ్రా ప్రాంతాల్లో. అల్‌ ఖోర్‌, వక్రా, మెసైయాద్‌లలో గురువారం 18 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చునని వెదర్‌ రిపోర్ట్‌ చెబుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com